Telangana Election Results : While KCR is looking for a second term in the state, the election is the first major test for the Congress-TDP alliance, with Rahul Gandhi and Chandrababu Naidu trying to stitch together a united front to take on the BJP in the 2019 general elections.
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాక కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. ఆయనపై సెటైర్లు వేశారు. మనకు ఈ విజయం ఎంత ముఖ్యమో, బాధ్యత కూడా అంతేనని కేసీఆర్ చెప్పారు. దేశ రాజకీయాల్లో మార్పులు రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ విషయమై తాను పలు జాతీయ పార్టీల నేతలతో మాట్లాడానని చెప్పారు. తెలుగు ప్రజలు బాగుండాలని తాను కోరుకుంటున్నానని కేసీఆర్ చెప్పారు. ఏపీ నుంచి తమకు లక్షల కొలది పోన్లు, సందేశాలు వచ్చాయని చెప్పారు. తమను ఏపీ రాజకీయాల్లో కలగజేసుకోవాలని అడుగుతున్నారని చెప్పారు. వాట్సాప్‌లో తమకు సందేశాలు వస్తున్నాయన్నారు. చంద్రబాబు తెలంగాణకు వచ్చి ఇక్కడ పని చేశారని, మేం కూడా ఏపీకి వెళ్లి అక్కడ పని చేయవద్దా అన్నారు. చంద్రబాబు ఇక్కడకు వచ్చి బర్త్ డే గిఫ్ట్ ఇచ్చారని, నేను కూడా ఏపీకి వెళ్లి ఇస్తానని చెప్పారు. చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని లేకుంటే ఏమైనా అంటే తెలంగాణ వారికి సంస్కారం లేదని అంటారని చెప్పారు. నేను ఏపీకి వెళ్తానని, దాని ఫలితం ఎలా ఉంటుందో చూపిస్తానని అన్నారు.
#kcr
#ChandrababuNaidu
#KCRCommentsOnChandrababu
#2019generalelections
#KCRPressMeet